2024asi | హైకోర్టు కీలక తీర్పు

2024asi | హైకోర్టు కీలక తీర్పు

2024asi | వివాదాస్పద స్థలం ఆలయానిదేనన్న ధర్మాసనం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మధ్యప్రదేశ్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల ఆలయ వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆ ప్రాంతంలో సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అలాగే ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది.

భోజ్‌శాల ఆలయ స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాలు వాదించగా, హిందూ వర్గాలు ఆలయ హక్కులు తమవేనని పేర్కొన్నాయి. ఈ వివాదంపై ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. 2024లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) 98 రోజుల పాటు అక్కడ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.

Leave a Reply