modi | వైరల్ అవుతున్న బీజేపీ ఇండియా మ్యాప్ పోస్ట్
modi | వైరల్ అవుతున్న బీజేపీ ఇండియా మ్యాప్ పోస్ట్
modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంటోంది. వూహించని రీతిలో వెస్ట్ బెంగాల్ ఫలితాలలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, ఇప్పుడు బెంగాల్ కోటను కూడా కమల దళం బద్దలు కొడుతోంది. తాజాగా బీజేపీ ఒక మ్యాప్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మ్యాప్‌లో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ కాషాయ రంగులో మెరిసిపోతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఫలితాల తర్వాత ఈ రంగు మరింత విస్తరించింది. ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా ఈ విజయ పరంపర కొనసాగుతోందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
బెంగాల్‌లో సరికొత్త చరిత్ర..
గతంలో ఎన్నడూ లేని విధంగా వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకెళ్లడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మొదటిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ చేరుకోవడం విశేషం. మమతా బెనర్జీ కంచుకోటలో కమలం వికసించడం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అయింది.
దక్షిణ భారతంలో విభిన్న పరిస్థితి..
మ్యాప్ అంతా కాషాయమయం అవుతున్నా, దక్షిణ భారతదేశంలో మాత్రం ఇంకా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేదా ఇతర పార్టీలే బలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాలను కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన తదుపరి వ్యూహాలను రచిస్తోంది.
