పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి..

కడెం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

శుక్రవారం మండల కేంద్రం కడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకవైపు పెట్రోల్ వినియోగం తగ్గించాలని చెబుతూనే మరోవైపు మోడీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ పేద, మధ్యతరగతి వాహనదారులపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమై అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీంతో సామాన్య ప్రజల జీవనోపాధి కష్టతరంగా మారిందన్నారు.

ఇకనైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.