రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన…

రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన…

జైనూర్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం పూర్తయి శనివారం రంజాన్ పండుగ ఉన్నందున ప్రార్థనల సౌకర్యార్థం చేపట్టిన పనులను కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ నాయకులతో కలిసి పరిశీలించారు. జైనూర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఏర్పాట్ల పనులు జరుగుతుండ గా పనులను పరిశిలించారు.

కావలసిన ఏర్పాట్ల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీల్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు షేక్ రహీం, నాయకులు హాసన్, షాకిర్, అజీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.