ప్రజపాలనలో సమస్యల వెల్లువ
ప్రజపాలనలో సమస్యల వెల్లువ
చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాళా అధికారులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల పై అధికారులు, కౌన్సిలర్లు చర్చించారు. ఈ సందర్బంగా పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీరు, రోడ్ల సమస్యలపై 99రోజుల ప్రణాళిక నిర్వహించారు. రోడ్లు, తాగునిటీ, కోతుల బేడాద, పారిశుద్ధ్యం పలు సమస్యల పై బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
