ఎస్‌ఐఆర్ ఫారాలను గడువులోగా సమర్పించాలి
- సూర్యాపూర్ సర్పంచ్ రాజన్న
కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల మండలంలోని సూర్యాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓటర్లు ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను గడువులోగా సంబంధిత బీఎల్‌ఓకు తప్పనిసరిగా అందజేయాలని గ్రామ సర్పంచ్ రాజన్న కోరారు.
గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఫారాలను తమ వద్ద ఉంచుకోకుండా అవసరమైన ఆధారాలతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఫారాలు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వివరించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఓటరు తన పూర్తి వివరాలను నమోదు చేసి గడువులోగా ఫారాలు అందించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
స్థానిక యువకులు గ్రామపంచాయతీలో సేవకులుగా పనిచేస్తూ ఫారాలు నింపడంలో, అవసరమైన వివరాలు, ఆధారాల సేకరణలో ప్రజలకు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, బీఎల్‌ఓ, వివిధ శాఖల అధికారులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
