RTA Act Iచరిత్రలో నిలిచిపోయిన నాయకత్వం

RTA Act I చరిత్రలో నిలిచిపోయిన నాయకత్వం
RTA Act I ఆర్థిక సంస్కరణలతో దేశ దిశను మార్చిన శక్తివంతమైన పాలన
సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసిన చారిత్రక పథకాలు
RTI, RTE, MGNREGAతో ప్రజా హక్కులకు కొత్త బలం
రైతులకు ఊరటనిచ్చిన బలమైన విధానాలు – సానుకూల ప్రభావం
ఆర్థిక మాంద్యంలోనూ భారత్‌ను నిలబెట్టిన స్థిరమైన నాయకత్వం
నిశ్శబ్దమైన కానీ ప్రభావవంతమైన దౌత్య నాయకత్వం
చరిత్రలో నిలిచిపోయిన యుగాంతర నాయకుడు మన్మోహన్ సింగ్
RTA Act I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ఆర్థిక సంస్కరణలతో దేశ దిశను మార్చిన నాయకత్వం… నిశ్శబ్దంగా, కానీ లోతుగా పని చేసిన పాలన.. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన నిర్ణయాల వెనుక ఉన్న పేరు సర్దార్ మన్మోహన్ సింగ్. భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి ప్రజల్లో ఒక ప్రత్యేక భావన ఎప్పటికీ మిగిలే ఉంటుంది. తక్కువ మాటలు, కానీ పెద్ద ప్రభావం చూపిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోయింది.
దేశంలో సామాన్యుడి జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపిన అనేక పథకాలు, చట్టాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. 240 రూపాయలకే యూరియా, 450 రూపాయలకే అమ్మోనియా, 600 రూపాయలకే డీఏపీ , 350 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 60 రూపాయలకే పెట్రోల్, 55 రూపాయలకే డీజిల్ , ఎరువుల సబ్సిడీలు, గ్యాస్ సిలిండర్ ధరల నియంత్రణ, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో సబ్సిడీ విధానాలు వంటి అంశాలు రైతులు, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన అంశాలుగా మన్మోహన్ హాయంలో గుర్తింపు పొందాయి.
అదే సమయంలో ఆర్టీఏ చట్టం, విద్యా హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ వ్యవస్థ వంటి చారిత్రక విధానాలు దేశ పాలనా వ్యవస్థను ఎటువంటి తప్పుడు ప్రచారాలు అవినీతి లేకుండా పూర్తి ఆయన పూర్తి చేశారు. ఆర్టీఏ చట్టం వంటివి అమలు చేసి, తన స్వంత ప్రభుత్వంలోని అవినీతిపరులను కూడా ఆయన జైలుకు పంపించారు .
రైతుల రుణమాఫీ నిర్ణయాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల పెంపు వంటి చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయని గుర్తుచేస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో ఆయన పాత్ర కీలకమని ఆర్థిక నిపుణులు పేర్కొంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత స్థాయిని నిలబెట్టడంలో ఆయన దౌత్యపరమైన నిశ్శబ్ద నాయకత్వం ప్రత్యేక గుర్తింపు పొందింది. సర్దార్ మన్మోహన్ సింగ్ పేరు భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

CLICK HERE TO READ Veedi Satheesh | కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
