పిన్నకుంట చెరువు కట్ట అభివృద్ధికి శ్రీకారం

పిన్నకుంట చెరువు కట్ట అభివృద్ధికి శ్రీకారం

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ, ఆత్మకూరు గ్రామాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలిగామ గ్రామంలో రూ.7.5 లక్షల వ్యయంతో చేపడుతున్న పిన్నకుంట చెరువు కట్ట వెడల్పు పనులను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెరువు కట్ట విస్తరణతో రైతులకు, గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం బొబ్బిలిగామ, ఆత్మకూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మెన్ రామ్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మెన్ రత్నాకర్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ కోల్కూర్ మాణిక్ రెడ్డి, బొబ్బిలిగామ మాజీ సర్పంచ్ గోపాల్, సేవాదళ్ చైర్మెన్ సందీప్ కులకర్ణి, ఏటిగడ్డ సంఘం మాజీ చైర్మెన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply