ప్రారంభానికి సిద్ధమైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు సరస్వతీ నగర్లో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది.
గతంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆలయానికి శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూర్తిగా శిలాఫలకాలతో, రాతి కట్టడ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
కాలనీవాసులు, పెద్దల సహకారంతో ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి నాయకులు నరోత్తం రెడ్డి, మహిపాల్ రెడ్డి, కాపు మధుకర్ తదితరులు విశేషంగా కృషి చేసినట్లు పేర్కొన్నారు.
