బసవేశ్వరుడికి నివాళులర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, ఆంధ్రప్రభ : సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు చూపిన మార్గం ఆచరణీయమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ, బసవేశ్వరుడు ఒక్క వర్గానికే చెందినవాడు కాదని, అందరివాడని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నులి బసవరాజ్, వీరశైవ సమాజం అధ్యక్షుడు గంగాడ వీరేశం, శెట్టి బసవరాజ్, విజయకుమార్, అప్ప శెట్టి బసవరాజ్, వైద్యనాథ్ గిరీష్, రవి జే. వైద్యనాథ్, దానం రాజు, కౌన్సిలర్లు మల్లికార్జున గౌడ్, అనిల్ యాదవ్, నాయకులు సురేష్, గాండ్ల పల్లవి, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply