500 acres | ”జలధార – జలహారతి”తో రైతుల్లో కొత్త ఆశలు

500 acres | ”జలధార – జలహారతి”తో రైతుల్లో కొత్త ఆశలు

ఉపాధి హామీ పనులతో చెరువులో పూడిక తీత‌
600 ఎకరాల సాగుకు నీటి భరోసా..

500 acres | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా సంజామల మండలంలోని నొస్సం గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు ఇప్పుడు గ్రామ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు పూడికతో నిండిపోయి తన అసలు సామర్థ్యాన్ని కోల్పోయిన ఈ చెరువు, ఇప్పుడు జలధార – జలహారతి కార్యక్రమంతో కొత్త జీవం పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పూడికతీత పనులు రైతాంగంలో కొత్త ఆశలు నింపుతున్నాయని గ్రామస్తులు పేర్కొనటం విశేషం.

500 acres | గ్రామంలో ఒక్కటే చెరువు..

గ్రామంలో ఉన్న పెద్ద చెరువు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువుకు చుట్టుపక్కల నాలుగు వేల ఎకరాల కొండ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరుతుంది. ప్రతి వర్షాకాలంలో కొండల నుంచి ఉరకలెత్తే నీరు ఈ చెరువులోకి చేరి నిండుగా నీరు నిల్వ ఉండేది. చెరువుకు ఉన్న రెండు తూముల కింద దాదాపు 500 ఎకరాల సాగుభూమి కి నీరు అందుతుంది. ఈ భూముల్లో ప్రధానంగా వరి పంట సాగు చేస్తుంటారు. అయితే సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక కారణంగా చెరువు లోతు తగ్గిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ రావడం రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులకు అవసరమైనంత కాలం సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దృష్టికి తీసుకెళ్లారు. జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువు పూడికతీత పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ఈ పనుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో  రూ.9.51 లక్షలు వెచ్చించి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ శ్రామికులు, రైతులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.

500 acres |

500 acres | పెరిగిన చెరువు నీటి నిల్వ సామ‌ర్థ్యం..

పూడికతీత పనుల వల్ల చెరువు లోతు గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో మరింత ఎక్కువ నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 ఎకరాలకు పరిమితమైన సాగు విస్తీర్ణం, ఇకపై 600 ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నుంచి తీస్తున్న సారవంతమైన మట్టిని రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకుంటున్నారు. ఈ మట్టితో పొలాల్లో ఉన్న గుంతలను పూడ్చడం, తెగిపోయిన గట్లను బలపరచడం, భూమి సారాన్ని పెంచడం జరుగుతోంది. దీంతో భూముల ఉత్పాదకత పెరిగి మంచి దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు.

500 acres | చెరువులు గ్రామీణ వ్యవసాయానికి జీవనాడి..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  మాట్లాడుతూ, చెరువులు గ్రామీణ వ్యవసాయానికి జీవనాడి వంటివి. పూడికతీత పనులు కేవలం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాదు, రైతుల ఆదాయాన్ని పెంచే శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయి. ‘జలధార – జలహారతి’ కార్యక్రమం ద్వారా ప్రతి నీటి వనరును పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

CLICK HERE TO READ MORE : 300 units | త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం రెడీ

CLICK HERE TO READ MORE

Leave a Reply