హనుమాన్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి..
మోపిదేవి, ఆంధ్రప్రభ ; హనుమాన్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పలువురు పెదకళ్ళేపల్లి గ్రామ ప్రముఖులు కోరారు.మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్ళేపల్లి గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రముఖులు మే 12 వ తేదీ మంగళవారం రోజున ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.12 వ తేదీ మంగళవారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, రథం బజారులో గ్రామోత్సవం, ర్యాలీ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. గ్రామ ప్రముఖులు కేతరాజు శ్రీనివాసరావు, సంగాబత్తుల శ్రీనివాసరావు, అరజా కిరణ్ కాంత్, చోడగం రాధాకృష్ణ ( నాని ), తలుపుల సుధాకర్, కలారి రామారావు, గంధం కృష్ణయ్య, గోళ్ళ నాని, గెట్టా వెంకటరత్నం నాయుడు, గంధం వీరాంజనేయులు, చెన్నకేశవుల రామారావు, అనువంశిక అర్చకులు మారెమండ శారదా కుమారి, అనువంశిక సేవకులు రాయవరపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
