నూతన వధూవరులు ఆశీర్వదించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం కొండుకూర్ గ్రామంలోని ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగేల భూషణ్ కుమార్తె సౌమ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరై నూతన వధూవరులు సౌమ్య–రాకేష్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.