Stock Markets | సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్.. నిఫ్టీకి భారీ షాక్
Stock Markets | సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్.. నిఫ్టీకి భారీ షాక్
Stock Markets | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, బంగారంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు, ఇరాన్‌కు సంబంధించిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా పతనమయ్యాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 850కిపైగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9.35 గంటల సమయానికి సెన్సెక్స్ 908 పాయింట్లు నష్టపోయి 76,414 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 232 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ, ఉదయం 9.35 గంటలకు 266 పాయింట్లు కోల్పోయి 23,909 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
