నేడు చిట్యాలలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాల ఇంటర్వ్యూలు

నేడు చిట్యాలలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాల ఇంటర్వ్యూలు

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 2025-26 సంవత్సరానికి గానూ ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద వివిధ పథకాలకు ఎంపిక చేసేందుకు మే 7వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి ఎస్.పి. జయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

​జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి కమిటీ ద్వారా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల నుండి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని, అర్హులైన అభ్యర్థులు సరైన ధృవపత్రాలతో మే 7వ తేదీ ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమె సూచించారు.