రెండు వాహనాలు పట్టివేత
రెండు వాహనాలు పట్టివేత
జైపూర్ , ఆంధ్రప్రభ : అక్రమంగా తరలిస్తున్న పశువులను (ఆవులు, ఎద్దులు) రవాణా చేస్తున్న రెండు వాహనాలను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మహారాష్ట్ర కు చెందిన MH40CD 1815, అలాగే AP36TA 0526 గల రెండు డీసీఎం వాహనాల్లో సుమారు 31 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులు రెండు వాహనాలను, నలుగురు వ్యక్తుల ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జైపూర్ ఇందారం వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ లను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై భూమేష్ సూచించారు.
