దండేపల్లిలో బీజేపీ నిరసన… కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం

దండేపల్లి, ఆంధ్రప్రభ : మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీజేపీ నాయకులు దండేపల్లిలో ఆందోళన చేపట్టారు. శనివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ కన్వీనర్ గోపతి రాజయ్య నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా మహిళల పట్ల వారి వైఖరి బయటపడిందని విమర్శించారు. దేశంలోని మహిళలు బీజేపీకి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. మహిళా బిల్లు, పునర్విభజన బిల్లులు భవిష్యత్తులో అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్ణణాల కిషన్, వెల్గనూర్ సర్పంచ్ మానస తులసి, మాజీ ఎంపీటీసీ బోడ నర్సింగు నాయక్, శక్తి కేంద్ర ఇంచార్జులు చిర్ల వెంకటేశ్వర్లు, రాస శ్రీనివాస్, దుమ్మని సత్తయ్య, ముత్తే వెంకటేష్, టెకమట్ల గురువయ్య, స్వర్గ శంకరయ్య, లక్కకుల బుచ్చన్న, వల్లంబట్ల శ్రీనివాస్, ఎంబడి దిలీప్, కానగంటి కుమార్, సోయం కిషన్, ముత్తినేని మల్లేష్, నలిమేల సుధీర్, కమ్మల బుచ్చన్న, సూదుల లచ్చన్న, సత్యం వెంకటేష్, మహేందర్, చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
