ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు.
మాంగ్ సమాజ్ సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ను స్థాపించి మందకృష్ణ మాదిగ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా పెళ్లి గణేష్, జంగంపల్లి రమేష్, ఎలగుర్తి సురేష్, పాందరి రాజు, ఆదివాసీ నాయకులు మెస్రం ఇంద్రు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
