మార్కెట్ డైరెక్టర్‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండడి లింగు ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆయనను పరామర్శించారు.

వాంకిడి మండలం గోయిగాం గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్‌రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ముఖీద్, డీసీసీ సభ్యుడు పెందూర్ ప్రకాష్, వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్నూలె నారాయణ, సర్పంచ్‌లు పంద్ర కౌసల్య, మెస్రం స్పందన భూపత్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం దత్తు, హైదర్ తదితరులు పాల్గొన్నారు.