AP | రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు..
AP | రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు..
600 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత
పోలీసుల అదుపులో నిందితుడు
AP | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. స్థానిక శాంతి నగర్ అభినందన ఫ్లాట్స్ లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. సుమారు 600 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న డేరంగుల గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

