ఈదురు గాలులతో కూడిన వర్షం
ఈదురు గాలులతో కూడిన వర్షం
-గాలులకు ఉడిన ప్లెక్సీ బోర్డులు
-నేలకొరిన చెట్లు,స్తంభించిన విద్యుత్
మందమర్రి , ఆంధ్రప్రభ : ఈదురు గాలులు,ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం అరగంట పాటు కుండపోత వర్షం కురవడంతో మందమర్రి పట్టణంలో వరదలతో పోటెత్తింది.వర్షం విరామం లేకండా కుండపోతగా కురవడంతో ఎటు చూసిన వరదలు ప్రవహించడం జరిగింది. ఈదురు గాలులకు పట్టణంలోని బస్ స్టాండ్ ఏరియాలో,సింగరేణి పాఠశాల ముందు గల ప్లెక్సీలు,పోలీస్ స్టేషన్ బోర్డు ఊడిపడ్డాయి.
అలాగే ప్రాణహిత కాలనీ,బి వన్ సింగరేణి క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు,పోలీస్ స్టేషన్ ముందు చెట్టు నేలకులడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల చెట్టు ఏరియాలో విద్యుత్ తీగలపై ప్లెక్సీ బోర్డు పడటంతో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల ఫంక్షన్ శుభకార్యాలు చేసుకునే, వచ్చిన అతిథులుగా బిక్కుబిక్కుమంటూ భయబ్రాంతులకు గురయ్యారు.
ఇదే కాకుండా మండలంలోని పొన్నారం, గుడిపెల్లి,ఎదులపురం, సారంగాపల్లి, సండ్రోన్ పల్లి మొదలైన గ్రామాల్లో చెట్లు నేలకొరగడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

