కొత్తపల్లిలో విద్యుత్ సమస్య తీర్చిన సర్పంచ్.

కొత్తపల్లిలో విద్యుత్ సమస్య తీర్చిన సర్పంచ్.

ఊట్కూర్, మే 3 (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లిలో విద్యుత్ సమస్యను కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములు తన దైవశైలిలో పరిష్కరిస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ సమస్య లోఓల్టేజి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోసర్పంచ్ కలెక్టర్, జిల్లా విద్యుత్ అధికారులతో కలిసి విద్యుత్ సమస్య పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు అధికారులకు విజ్ఞప్తి చేయగా రెండు విద్యుత్ బుడ్డీలు మంజూరు చేయడంతో పాటు వ్యవసాయ బోరు మోటార్ల వద్ద స్తంభాలు లేకపోవడంతో కర్రల సహకారంతో విద్యుత్ ప్రమాదకరంగా ఉండగా విద్యుత్ స్తంభాలు మంజూరు చేయించిఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ సమస్య తీర్చడంతో పాటు లో వోల్టేజ్ సమస్యకుచెక్ పెట్టారు. ఆదివారం గ్రామ శివారులో విద్యుత్ బుడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొన్ని ఏళ్ళ నుండి సమస్య పరిష్కరించిన సర్పంచ్ కు ప్రజల కృతజ్ఞతలుతెలిపారు.