ఇందిరమ్మ ఇంటితో పేదింటి కల సహకారమైంది …

ఇందిరమ్మ ఇంటితో పేదింటి కల సహకారమైంది …
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని సర్వేల్ గ్రామానికి చెందిన ఎల్లంకి పారిజాత అశోక్ గౌడ్ కుటుంబనికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ చిలకరాజు చందన రాజు ఆదివారం గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పేదింటి కళ సహకారం అవుతున్నాయని అన్నారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్, రమాదేవి, షేక్ షబ్బీర్, మానుపాటి సతీష్, శేఖర్ రెడ్డి, బాజా అంజయ్య,చిలుకరాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
