కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండి.
కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండి.
- ఆర్జీపీఎస్ అధ్యక్షులు త్రిమూర్తి
లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : కాంగ్రెస్ అభ్యర్థి శనిగారపు చిన్నయ్య, పెండం పద్మ లకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్జిపిఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పట్టణాధ్యక్షుడు ఆరీఫ్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని గోదావరి రోడ్ లో ఏర్పాటు చేసిన 5, 10 వార్డ్ ల ఎన్నికల ప్రచారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచి ఉంటుందని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో లక్షేట్టిపేట అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ స్కూల్, జూనియర్ కాలేజ్ నిర్మాణాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుతున్నాయన్నారు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరస్తున్నారని తెలిపారు. పంటలకు సాగునీరు లోటు లేకుండా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఉచిత కరెంటు, సన్న బియ్యం,పెన్షన్స్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఎన్నో హామీలు నెరవేర్చినట్లు వివరించారు.
20 ఏళ్లలో జరుగని అభివృద్ధిని కేవలం మూడేళ్ళలోనే కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని పలువురు నాయకులు కోరారు.ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా శనిగారపు చిన్నయ్య, పెండం పద్మలు ప్రజలకు పని చేస్తారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఆరీఫ్, సీనియర్ నాయకులు బియ్యాల తిరుపతి, శాంతి కుమార్,కట్ల చంద్రయ్య, ముఖరం జా,5 వార్డ్ అభ్యర్థి శనిగారపు చిన్నయ్య,10 వ వార్డ్ అభ్యర్థి పెండం పద్మ-రాజు,అభినయ్,రాజు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
