అంగరంగ వైభవంగా ఐదు రోజులు కార్యక్రమాలు..
అంగరంగ వైభవంగా ఐదు రోజులు కార్యక్రమాలు..
అన్ని ఏర్పాట్లు పూర్తి, గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్,
చిట్యాల, ఆంధ్రప్రభ : గీతా కార్మికుల ఆరాధ దైవమైన ,శ్రీ రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి, దేవాలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో, గౌడ సంఘం కుటుంబ సభ్యులు శనివారం నుండి బుధవారం వరకు ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో వార్షికోత్సవం ముగిస్తుందని చిట్యాల గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం తెలిపారు. రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర వార్షికోత్సవం లో పూజార్ల ఆధ్వర్యంలో ఈనెల 2 న శనివారం గ్రామదేవతలు, గణపతి పూజ, 3 న ఆదివారం కంఠమేశ్వర స్వామి పూజలు, పోచమ్మ బోనాలు, 4, సోమవారం జలాభిషేకం, పోచమ్మ అమ్మవారికి, ప్రత్యేక అలంకరణ, 5 మంగళవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు, బలి, ప్రత్యేక పూజలు, 6 ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వర స్వామి పూజలు , విందు కార్యక్రమం తో ముగింపు ఉంటుందని, ఆయన తెలిపారు. రెండవ వార్షికోత్సవానికి దేవాలయం వివిధ రంగులతో అలంకరణకు సిద్ధమై, మామిడి, వేప ఆకుల తోరణాలతో, కాషాయం జెండాలు, తోరణాలతో సిద్ధమైంది. సకాలంలో గౌడ కుటుంబ సభ్యులు హాజరై వార్షికోత్సవం విజయవంతం చేయాలని అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ కోరారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెరుమండ్ల రాజు, డైరెక్టర్లు, ఆముదాలపల్లి శ్రీనివాస్, గుర్రపు రాజు, బుర్ర నరేష్, బుర్ర రాజ్ కుమార్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

రెండో వార్షికోత్సవవానికి ఏర్పాట్లు పూర్తి, చిట్యాల గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్,
మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ఆరాధ దైవమైన రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఐదేళ్లకోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు, అన్ని అంగులతో దేవాలయం ముస్తాబు చేసినట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవ నిర్వహించే ఐదు రోజులు గౌడ సంఘం కుటుంబ సభ్యులు, సకాలంలో హాజరై విజయవంతం చేయాలని లక్ష్మణ్ గౌడ్ కోరారు.


