Lella Appireddy | ఆసుపత్రి గేట్లు మూసివేయడంపై పోలీసులతో వాగ్వాదం

Lella Appireddy | ఆసుపత్రి గేట్లు మూసివేయడంపై పోలీసులతో వాగ్వాదం

Lella Appireddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద పోలీసుల వ్యవహారశైలిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగిని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అత్యవసర వార్డు ప్రధాన ద్వారాన్ని పోలీసులు మూసివేసి అడ్డుకోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రి గేట్లను ప్రజలకు అందుబాటులో లేకుండా ఎలా మూసివేస్తారని అధికారులను ఆయన నిలదీశారు. రోగులకు సేవలు అందించాల్సిన చోట ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని మండిపడ్డారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీకి, అక్కడున్న పోలీసు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ అనుచరులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నిబంధనల పేరుతో రోగులను ఇబ్బంది పెట్టవద్దని, సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని నేతలు డిమాండ్ చేశారు.

Leave a Reply