85.25percent | అమ్మాయిలదే.. హవా
85.25percent | అమ్మాయిలదే.. హవా
టెన్త్‌లో సరస్వతులే టాప్ !
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
బాలికలు 87.90 శాతం, బాలురు 82.68 శాతం..
మన్యం జిల్లా 96.07% ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్
57.12 శాతంతో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానం
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం
85.25percent | అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం ఫలితాలను ప్రకటించారు. టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 81.14 శాతం ఉత్తీర్ణతతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టెన్త్ ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 82.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.39కి పెరిగింది. ఇక ఫలితాల్లో మన్యం జిల్లా 96.07% ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, 57.12% ఉత్తీర్ణతతొ అల్లూరి జిల్లా ఉంది.

85.25percent | ఫలితాలను ఇలా చూడండి..
టెన్త్ ఫలితాలను www.results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వాట్సాప్ ‘మన మిత్ర’ సేవ ద్వారా 9552300009కు ‘Hi’ అని పంపి ఫలితాలను తెలుసుకోవచ్చు. LEAP యాప్, డిజీ లాకర్ యాప్, పాఠశాల లాగిన్స్‌లో కూడా విద్యార్థులు టెన్త్ ఫలితాలను చూడవచ్చు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. వీటిని apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, ‘మన మిత్ర’, DigiLocker ద్వారా చూడవచ్చు.
మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా – 96.07% ఉత్తీర్ణత
రెండో స్థానంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ : 95.85% ఉత్తీర్ణత
మూడో స్థానంలో విజయనగరం – 91.08% ఉత్తీర్ణత
చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా – 57.12% ఉత్తీర్ణత
85.25percent | జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు:
కర్నూలు జిల్లా – 71.08% ఉత్తీర్ణత
విశాఖపట్నం – 89.51% ఉత్తీర్ణత
గుంటూరు – 88.89% ఉత్తీర్ణత
తూర్పు గోదావరి – 88.49% ఉత్తీర్ణత
కృష్ణా జిల్లా- 88.06% ఉత్తీర్ణత
ఎన్టీఆర్ జిల్లా -87.91% ఉత్తీర్ణత
నెల్లూరు – 87.37% ఉత్తీర్ణత
అనంతపురం – 77.17% ఉత్తీర్ణత
చిత్తూరు- 76.69% ఉత్తీర్ణత
కొన్ని జిల్లాల్లో 90% పైగా ఉత్తీర్ణత నమోదు
మొత్తం హాజరైన విద్యార్థులు – 6,18,131
ఉత్తీర్ణులైన విద్యార్థులు – 5,26,954
సప్లిమెంటరీ, రీ-వెరిఫికేషన్ వివరాలు..
రీకౌంటింగ్ అండ్ రీ-వెరిఫికేషన్
ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు మే 1 నుంచి మే 7(రాత్రి 11 గంటల) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీ-వెరిఫికేషన్‌కు రూ.1,000 ఫీజు చెల్లించాలి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ: పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారి కోసం మే 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అపరాధ రుసుము లేకుండా మే 9 వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 10 నుంచి మే 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. సబ్జెక్టు వారీగా మార్కుల మెమోలు నాలుగు రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు అభినందనలు: లోకేశ్..
టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. ‘మీ కృషి, అంకితభావం ఫలించాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దు. ఇది ఒక పరీక్ష మాత్రమే. మళ్లీ ధైర్యంగా ప్రయత్నించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.
CLICK HERE TO READ MORE : 10th Results : వావ్.. బీసీ బిడ్డల అద్భుతం Andhra Prabha Top News
