బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (సోమవారం) ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో కలిసారు. ఈ సదర్భంగా వీరి మధ్య దాదాపు ఒక గంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రత్యేకంగా ప్రాధాన్యం పొందింది. కాగా, కేసీఆర్‌కు జూన్ 5న, హరీష్ రావుకు జూన్ 6న, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు జూన్ 9న విచారణకు కమిషన్ రావాలని సూచించింది.
ఈ సందర్భంగా, కమిషన్ ముందు హాజరు కావడం, న్యాయపరమైన దశలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేసీఆర్, హరీష్ రావు చర్చించినట్లు సమాచారం.