పదిలో మైనారిటీ గురుకుల బాలికల ప్రభంజనం

పదిలో మైనారిటీ గురుకుల బాలికల ప్రభంజనం

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సంగారెడ్డి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో తమ సత్తా చాటారు, పదవ తరగతిలో 57 విద్యార్థులకు గాను 57 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల ప్రథమ స్థానంలో సాదియా- 562 మార్కులు, ద్వితీయ స్థానంలో నౌషీన్-557 మార్కులు, తృతీయ స్థానంలో రత్నాలపల్లి మదిహా బేగం 552 మార్కులు సాధించారు.

17 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా పొందడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ ఇ.హేమలత తెలిపారు. విద్యార్థుల కృషి ఉపాధ్యాయుని బృందం నిరంతర ప్రోత్సాహంతో ఈ ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply