ఆంధ్రప్రభ ఎఫెక్ట్…
ఆంధ్రప్రభ ఎఫెక్ట్…
- చేవెళ్లలో “డయాలసిస్ సేవలు బంద్” కథనానికి స్పందన.
- డయాలసిస్ సెంటర్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే యాదయ్య
- ఫాలియేటివ్ కేర్ లోకి డయాలసిస్ సెంటర్ ను మార్చాలని డీసీహెచ్ఎస్ కు సూచన
చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్లలో “డయాలసిస్ సేవలు బంద్” అంటూ ఆంధ్రప్రభ జిల్లా మెయిన్ టాబ్లాయిడ్ లో ప్రచు రితమైనా కథనానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందించారు. శనివారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించారు. సెంటర్లో నెలకొన్న సమస్యలను సిబ్బంది ద్వారా తెలుసుకొని రాష్ట్ర వైద్య విధాన జిల్లా అధికారి అనురాగిణి (DCHS)తో ఫోన్ లో మాట్లాడి సమస్యలను వివరించారు.
డయాలసిస్ రోగులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమెకు సూచించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతున్న దృష్ట్యా సమస్యలు తలెత్తుతాయని తెలిసిన ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని వైద్యాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పాలియేటివ్ కేంద్రాన్ని పరిశీలించారు.
డయాలసిస్ సెంటర్ ను పాలియేటివ్ కేంద్రంలోకి మార్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆదివారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, పాలియేటివ్ కేంద్రాన్ని DCHS అనురాగిణి పరిశీలించనున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, మద్దెల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బ్యాగరి రాములు తదితరులు ఉన్నారు.
