గోమాతను జాతీయ ఆవుగా గుర్తించాలి

గోమాతను జాతీయ ఆవుగా గుర్తించాలి
సంతకాల సేకరణ పత్రాల నాయకుల అందజేత
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గోమాతను జాతీయ అవగా గుర్తించాలని కోరుతూ సోమవారం గోమాత రక్షక అభియాన్, ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను హిందూ ఉత్సవ సమితి నాయకులు బీజేపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… గోమాతని రక్షించాలి గోమాత సేవ చేయాలి గోమాతని జాతీయ ఆవు. ఈ కార్యక్రమంలో గోరక్ష ప్రముకులు, టి. గోపాల్ సింగ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండెరి రమేష్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సూర్యవంశీ యోగేశ్వర్, రామగిరి శ్రీనివాస్, పెంట కైలాష్, విజయ్, మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరక్ష ప్రముఖ టి గోపాల్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపతి మురుము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్, రేవంత్ రెడ్డికి సంతకాల స్వీకరణ పత్రాలు పంపించి అమలు జరిగేలా చూడాలని కోరారు.
