జొన్నలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జొన్నలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జీసీసీ ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో జొన్నలు వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారంజీసీసీ ఆధ్వర్యంలో నారూర్ మండలం తడిహత్నూర్, గాదిగూడ మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తీసుకొచ్చిన జొన్నలు తడవకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలని రైతులు నష్టపోకుండా చూడాలని తెలిపారు. ఆన్లైన్ లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తో పాటు జీసీసీ సీనియర్ మేనేజర్ సంతోష్ కుమార్, అకౌంటెంట్ గోవిందరావు, సెంటర్ ఇన్చార్జులు ప్రేమ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
