జొన్న రైతుల గోడు ఎంపీ కి వినపడట్లేదా?

జొన్న రైతుల గోడు ఎంపీ కి వినపడట్లేదా?

  • కేంద్రాలు లేక అల్లాడుతున్న అన్నదాతలు

•పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో 15 లక్షల క్వింటాళ్ల నిలువ,రూ194 కోట్ల నష్టం

డోంగ్లి, ఆంధ్రప్రభ: ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు తమధాన్యం విక్రయించేందుకు కుదరడం లేదు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆశించిన రైతులకు రోజుకో గండంలా గడుస్తుంది. యాసంగి సీజన్లో ప్రతికూల వాతావరణాలే ఎదురైనప్పటికీ.. నానా తంటాలు పడి జొన్న పంట పండిస్తున్న రైతుకు నేటి వరకు తాము పండించిన ధాన్యం విక్రయించుకునే అవకాశం కుదరక ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారూ.ఖరీఫ్ సీజన్ మొత్తం ఏ పంట సాగు చేసినా నష్టాలే రావడంతో యాసంగిలో ఎన్నో ఆశలతో మొండి దైర్యంతో అప్పులు చేసి రైతులు జొన్న పంట సాగు చేశారు,జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సెగ్మెంట్ల రైతులు రబీ సీజన్‌లో కష్టపడి పండించిన జొన్నకు కొనుగోలు కేంద్రాలు లేక అల్లాడుతున్నారు. కోతలు పూర్తయి 40 రోజులు గడుస్తున్నా రైతుల గోడు ఎంపీ సురేష్ షెట్కర్ గారికి వినపడట్లేదా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

•రబీ జొన్నకు ఎంఎస్పీ రూ3,699, క్వింటాకు రూ1,400 నష్టం

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే సుమారు 15 లక్షల క్వింటాళ్ల రబీ జొన్న నిలువ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి క్వింటాకు రూ3,699 కాగా, బహిరంగ మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు, దళారులు రూ2,300 నుంచి రూ2,500 మాత్రమే ఇస్తున్నారు. దీంతో క్వింటాకు రూ1,199 నుంచి రూ1,399 నష్టం వాటిల్లుతోంది. మొత్తంగా రైతులకు సుమారు రూ194 కోట్ల నష్టంవచ్చే పరిస్థితి నెలకొంది.

•కేంద్రం నుంచి అనుమతి లేదు

గత నెలలో కేంద్ర వ్యవసాయ శాఖ రబీ2026 సీజన్‌కు తెలంగాణలో శనగ, మినుము, వేరుశనగ, సన్‌ఫ్లవర్ కొనుగోలుకు రూ894 కోట్లు మంజూరు చేసింది. కానీ రబీ జొన్నకు పిఎస్ఎస్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్09తేదీ న “కేంద్రం నుంచి రబీ జొన్నకు అనుమతులు రాలేదు, ప్రతిపాదనలు పంపాం” అని చెప్పిచేతులెత్తేశారు.గత నెల03న “రెండ్రోజుల్లో స్పష్టత వస్తుంది” అన్న అధికారులు నెల రోజులైనా మౌనం వీడలేదు.

ఏపీలో కొంటున్నారు,ఇక్కడ ఎందుకు కొనరు?

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం రూ 9,700 కోట్ల పిఎస్ఎస్ నిధులు విడుదల చేయడంతో 8 లక్షల టన్నుల జొన్న కొనుగోలుకు 120 కేంద్రాలు తెరిచి ఎకరానికి 14 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. “ఏపీలో కేంద్రం అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రబీ జొన్నకు ఎందుకు ఇవ్వట్లేదు? మన ఎంపీ గారు కేంద్రాన్ని ఎందుకు అడగట్లేదు?” అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రైతుల ఆవేదన

“అప్పు చేసి,కౌలు చెల్లించి రబీ జొన్న పండించాం. ఇప్పుడు కొనే దిక్కులేదు. గోడౌన్లలో నిల్వచేసే స్థోమత లేదు. ఎలుకలు, చీడపీడలు పట్టి నాశనం అవుతోంది. మా గోడు ఎంపీ సురేష్ షెట్కర్ గారికి వినపడట్లేదా?” అని జుక్కల్ మండల రైతులు ధర్నా చేసి న్నీటి పర్యంతమయ్యారు,కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఒక్క ఫోన్ చేసి ‘మా పార్లమెంట్ పరిధి లోని పలు నియోజకవర్గాల్లో 15 లక్షల క్వింటాళ్ల రబీ జొన్న ఉంది,ఎంఎస్పి రూ3,699 చొప్పున కొనండి’ అని ఎంపీ గారు ఎందుకు అడగరు? కేంద్ర ప్రభుత్వం వద్ద మా గోడు వినిపిస్తే కేంద్రం స్పందించి మా పంట ను కొనుగోలు చేసి మమల్ని ఆడుకోవాలని జుక్కల్,బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతులు వేడుకుంటున్నారు.

Leave a Reply