న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి..

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి..

కామారెడ్డి, ఆంధ్రప్రభ : న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి అత్తర్ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రకాష్ పటేల్ ను ఆదివారం ఆయన అభినందించి శాలువాలతో సత్కరించారు.

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక న్యాయ చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. న్యాయవాదులు ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. వారికి అందుబాటులో ఉండే మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు.