10న తెలంగాణ ఉపపీఠానికి జగద్గురువు శ్రీ నరేంద్రాచార్యజీ రాక
జుక్కల్/కామారెడ్డి (ఆంధ్రప్రభ): సమస్య మార్గదర్శనం–దర్శన కార్యక్రమంలో భాగంగా జగద్గురువు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రాచార్యజీ ఈ నెల 10న జుక్కల్ మండలంలోని దోస్‌పల్లి–బంగారుపల్లి వద్ద ఉన్న తెలంగాణ ఉపపీఠానికి రానున్నట్లు తెలంగాణ ఉపపీఠం సేవాసమితి వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
భక్తుల కోసం మంచినీరు, వైద్య సేవలు, భోజన వసతి తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు సేవాసమితి తెలిపింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి స్వామీజీ దర్శన కార్యక్రమం ప్రారంభం కానుండగా, రెండో రోజు శనివారం కూడా సమస్య మార్గదర్శనం–దర్శన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొంది.
శుక్రవారం సాధక్ దీక్ష, శనివారం ఉపాసక్ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సేవాసమితి వెల్లడించింది. ఇప్పటికే ఉపపీఠానికి భక్తుల రాక ప్రారంభమైందని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది.
