కోదండ రామస్వామి ఆలయ ప్రారంభోత్సవం

కోదండ రామస్వామి ఆలయ ప్రారంభోత్సవం
హాజరైన స్థానిక నేతలు
మణికొండ, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని మైహోం అవతార్, హాల్మార్క్ విసినియా సమీపంలో ఉన్న శ్రీ సంకటహరణ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జి కస్తూరి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే పార్టీ మాజీ అధ్యక్షుడు జితేందర్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, కిరణ్ కుమార్, పెండ్యాల మల్లేష్, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయం నిర్మాణం ప్రాంతీయ ప్రజలకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
