50days | భవిష్యత్తును మార్చే ‘బెస్ట్ టైమ్’ ఇదే !

50days | భవిష్యత్తును మార్చే ‘బెస్ట్ టైమ్’ ఇదే !
50days | కొత్త స్కిల్స్ నేర్చుకునే ‘బెస్ట్ టైమ్’ ఇదే!
ఆటలు, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం
స్క్రీన్ టైంకు ‘బ్రేక్’ – పుస్తకాల వైపు అడుగు
హాబీలతో క్రియేటివిటీకి రెక్కలు
ఫ్యామిలీ టైమ్ – విలువల బాటలో పిల్లలు
50days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని బడులకు బడులకు నేడే చివరి పనిదినం కానుంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ, ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అదే రోజు నుంచి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

పాఠశాలలకు సెలవు కావడంతో ఉదయాన్నే లేచే హడావుడి, హోంవర్క్ టెన్షన్లు లేకపోవడంతో పిల్లలకు ఈ సమయం ఒక పండుగలా ఉంటుంది. పిల్లలకు వేసవి సెలవులు అంటే ఎక్కడలేని ఉత్సాహం. తల్లిదండ్రులకు మాత్రం ఈ సెలవులను ఎలా సద్వినియోగం చేయాలనే ఆలోచన. అయితే, దొరికిన ఈ దాదాపు నెలన్నర కాలాన్ని కేవలం నాలుగు గోడల మధ్య, టీవీలు, స్మార్ట్‌ఫోన్లకే అంకితం కాకుండా, వాళ్ల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఇలా ప్లాన్ చేయండి.
50days | కొత్త స్కిల్స్ కి ప్రాధాన్యం..
రెగ్యులర్ చదువుల ఒత్తిడి లేని ఈ సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే బెస్ట్ టైమ్. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరచుకోవడానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసుల్లో చేర్పించవచ్చు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, చిన్న వయసు వారైతే అబాకస్ (Abacus), వేద గణితం నేర్చుకునేలా ప్లాన్ చేయండి.
ఆటలు, శారీరక వ్యాయామం..
రోజంతా ఇంటికే పరిమితం కాకుండా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గోనేలా చూసుకోవాలి. అయితే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా చూడాలి. సమ్మర్‌లో స్విమ్మింగ్ (ఈత) నేర్చుకోవడం అనేది అత్యుత్తమమైన ఎంపిక. ఇది వ్యాయామంతో పాటు బాడీని కూల్‌గా ఉంచుతుంది.
స్క్రీన్ టైం తగ్గించండి..

సెలవుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికి చెక్ పెట్టాలంటే.. ఫోన్ వాడకానికి రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని మాత్రమే కేటాయించాలి. స్ఫూర్తిదాయకమైన నాయకుల జీవిత చరిత్రలు, పంచతంత్ర కథలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి.
హాబీలను ఎక్స్‌ప్లోర్ చేయండి..
ప్రతి పిల్లాడిలో ఏదో ఒక సృజనాత్మక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసే సమయం ఇదే. డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ మేకింగ్ లాంటి వాటిలో శిక్షణ ఇప్పించండి. సంగీతం, డ్యాన్స్ పట్ల ఆసక్తి ఉంటే వాటికి సంబంధించిన సమ్మర్ క్యాంపులకు పంపడం మంచిది.
ఫ్యామిలీ టైమ్, సోషల్ స్కిల్స్..
పిల్లలకు కుటుంబ బంధాల విలువ తెలిసేలా చేయాలి. ఇంట్లో తాతయ్య, నానమ్మలతో సమయం గడిపేలా చేయాలి. వారి దగ్గర పాత కథలు వినడం వల్ల నైతిక విలువలు అలవడతాయి. చిన్న చిన్న ఇంటి పనుల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో బాధ్యత పెరుగుతుంది.
సెలవులు అనగానే పిల్లలను పూర్తిగా వదిలేయకుండా, అలాగని వారిపై మరీ ఎక్కువ నిబంధనలు పెట్టకుండా ఒక సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సరైన ప్రణాళికతో ఈ వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తూనే, వారి వ్యక్తిత్వ వికాసానికి ఒక బలమైన పునాదిగా మారండి.
click here to read more
click here to read ఇంటర్ పాసయ్యాక ‘టర్నింగ్ పాయింట్’ ఇదే!
