రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది

సమావేశాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరిగింది

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : రైతు భరోసా నిధుల విడుదల సమావేశం విజయం కావడం పట్ల మరింత బాధ్యత పెంచిందని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా ఉంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనే రైతులకు సమన్యాయం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన అశేష జనవాహినికి, రైతులకు, మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరమణులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి సమర్థంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా అధికారులకు, పోలీస్ శాఖ సిబ్బందికి, డి.ఎస్.బి వాలంటరీ సభ్యులకు, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల సమన్వయం క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని అభినందించారు. ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.