Bribe | ఏసీబీకి చిక్కిన ఆర్డీవో రామ్‌చంద‌ర్ నాయ‌క్‌

Bribe | ఏసీబీకి చిక్కిన ఆర్డీవో రామ్‌చంద‌ర్ నాయ‌క్‌

Bribe | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : నారాయణపేట ఆర్డీవో రామచందర్ మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బర్త్ సర్టిఫికెట్‌కు సంబంధించి ఓ వ్య‌క్తిని లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఆ వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ సారథ్యంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీవో రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ, డీఎస్పీ బాలకృష్ణ సారధ్యంలో విచారణ సాగుతోంది.

Leave a Reply