డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి

  • అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  • మోపిదేవిలో మృత్యుంజయ హోమం

మోపిదేవి – ఆంధ్రప్రభ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో మహా మృత్యుంజయ హోమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం హోమాలు నిర్వహించారు.

స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే చేసారు. నాగపుట్టలో పాలు పోసారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. పవన్ ఆరోగ్యం కోసం ఘంటసాల మండలం యండకుదురు నుంచి పాల కావిళ్లతో మోపిదేవికి జనసైనికులు వచ్చారు. యండకుదురు జనసైనికులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అభినందించారు.