నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత అంబటి బ్రాహ్మణయ్య…

నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత అంబటి బ్రాహ్మణయ్య…

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : మాజీ శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు అన్నారు.

అవనిగడ్డలోని ఒకటవ వార్డులో గల విక్కుర్తి కార్యాలయంలో మంగళవారం ఉదయం అంబటి బ్రాహ్మణయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విక్కుర్తి రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రాహ్మణయ్య చిత్రపటానికి విక్కుర్తి శ్రీనివాస్ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణయ్య సేవలను శ్రీనివాస్ కొనియాడారు…

కార్యక్రమంలో న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పోతబోయిన శ్రీనివాసరావు, దుడ్డు మురళి కంచర్ల కోటేశ్వరరావు, అన్నపురెడ్డి లక్ష్మీనారాయణ, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీను రేపల్లె ముసలయ్య, రేపల్లె ఈశ్వరరావు, భూపతి నాంచారయ్య లతో పాటు అంబటి బ్రాహ్మణయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply