జిల్లా పర్యాటక శాఖ అధికారికి ఘన సత్కారం

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలధీశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘంటసాల వెంకటేశ్వరరావు 60 ఏళ్ల కచేరి మహోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామ్ లక్ష్మణ్ను గ్రామ ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

ఆలయ అర్చకులు చావలి కృష్ణ కిషోర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల కళాసమితి ఘంటసాల కృష్ణమోహన్, బీజేపీ మండల అధ్యక్షులు తాళ్లూరి ఫణి హరి ప్రసాద్ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కొండపల్లి రామకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.