పొంగిపొర్లుతున్న డ్రైనేజీ… పట్టించుకోని అధికారులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుమధ్యలో ఉన్న యూజీడీ పైప్‌లైన్ గత కొంతకాలంగా లీకై మురుగు నీరు బయటకు వచ్చి పారుతోంది.

ఈ కారణంగా వాహనదారులు, కాలనీవాసులు రోజూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడమే ఈ సమస్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మధు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Leave a Reply