Chandrababu | అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం

Chandrababu | అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం

Chandrababu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ జన్మదినం సందర్భంగా ఇవాళ ఉదయం విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పటమట రైతు బజార్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అక్కడ సామాన్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 270కి పైగా అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా అల్పాహారం, భోజనం (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లలో ఒక రోజు ఉచిత ఆహార పంపిణీకి అవసరమైన రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు. అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేస్తున్న పేదలను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించి, వారికి అల్పాహారం వడ్డించారు.

Leave a Reply