ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం

ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం

  • కార్మికుడికి గాయాలు

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండలం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని C11, L5 బ్లాక్‌లో పేలుడు పదార్థాల ముడి సరుకు మిక్సింగ్ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న పెద్దకందుకూరు గ్రామానికి చెందిన మిర్యాల క్రాంతి కుమార్ అనే కార్మికుడు గాయపడ్డాడు. ఘటన అనంతరం అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply