రెగ్యులర్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం

రెగ్యులర్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం
హుజూర్నగర్, ఆంధ్రప్రభ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో భాగంగా హుజూర్ నగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు డివిజన్ పరిధిలోని ఆర్టిజన్ కార్మికులందరూ వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరవించేది లేదని తెలిపారు. 2024 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను పర్మినెంట్ చేస్తామంటూ ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కు తన పాదయాత్రలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.
ఏపీ ఎస్సీబీ రూల్స్ అమలు చేయటము, విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయడం మీటర్ రీడర్స్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదనంతరం పట్టణంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోకన్వీనర్ నకులుడు, డివిజన్ ప్రెసిడెంట్ వెంకట నరసింహ ఆచార్యులు, డివిజన్ కో చైర్మన్ విడుదల శ్రీనివాసరావు, తిరుపతిరావు, సైదులు, వీరభద్రం, జితేందర్ రెడ్డి, ప్రసాదు, శివ, శేఖర్ రెడ్డి, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.
