చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి..

చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి..

చిట్యాల, ఆంధ్రప్రభ : భారత దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారి ఉరి తాళ్ళను ముద్దాడిన నిజమైన దేశభక్తులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య లు అన్నారు. చిట్యాల లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు కా, భగత్ సింగ్ వర్థంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కా, భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి మాట్లాడారు.సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పని చేస్తూ,సమ సమాజ స్థాపనకు నిరంతరం యువత కృషి చేయడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి అని తెలిపారు.దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధం చర్యలను ఖండించటమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, సిపిఎం,డివైయప్ఐ వివిధ ప్రజా సంఘాల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, శీలా రాజయ్య, పంది నరేష్, ఐతరాజు నర్సింహా,కోనేటి రాములు, ఐతరాజు యాదయ్య, అక్కెనపల్లి నాగయ్య, పాలమాకుల అర్జున్,పాల లక్ష్మయ్య,జిట్ట స్వామి, బొడ్డు బాబురావు, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.