dr.b.r.ambedkar రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు

dr.b.r.ambedkar రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు

గ్రామాలన్నింటిలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు,

ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల సమిష్టిగా పాల్గొనడంతో విజయవంతం,

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నర్సంపేట మండలంలోని గ్రామాల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. నర్సంపేట మండలంలోని 19 గ్రామపంచాయతీ కార్యాలయాలలో, ప్రధాన కూడళ్లులో, అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం గురించి ప్రజలకు వివరించారు.

వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి దిశానిర్దేశం చేసిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించి సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఆయన సిద్ధాంతాలు మార్గదర్శకమని తెలిపారు.

గ్రామస్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ జయంతి వేడుకలు గ్రామాల్లో ఐక్యతను, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా అంబేద్కర్ ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ సమాజానికి సేవ చేయాలని సంకల్పించారు.

Leave a Reply