ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతి చెందడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ వద్ద తన పై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం తెలంగాణలో పలు చోట్ల సంస్థ కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అట్టించుకున్నాడు. వెంటనే ఆయన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అయితే.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందడంతో సహచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
