narsampeta అంబేద్కర్ ఆశయాలే మా మార్గం,

narsampeta అంబేద్కర్ ఆశయాలే మా మార్గం,

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నర్సంపేట మండల రూరల్ గ్రామం నాగూర్లపల్లి ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు తణుకుల అంబేద్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

acchampeta
acchampeta

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రాణా ప్రతాపరెడ్డి హాజరై అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో ఉన్న కుల, మత, వర్గ వివక్షలను నిర్మూలించడానికి ఆయన చేసిన పోరాటం అపారమని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే మూల సూత్రాలను దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.

యువతను ఉద్దేశించి మాట్లాడుతూ,
“కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని ఆచరణలో పెట్టాలి. విద్య, శ్రమ, ఐక్యత ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది” అని తెలిపారు.

అంబేద్కర్ ఆలోచనలు ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ ఆలోచనలు మరోసారి ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. సమాన సమాజ నిర్మాణమే నిజమైన నివాళి అని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply